చోడవరం కే కాలనీ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ఆదేశాల మేరకు, స్కూల్ చైర్మన్ నేమాల హరి ఆధ్వర్యంలో స్వచ్చభారత్ కార్యక్రమం జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో, ఇందిరాగాంధీ పార్కు వద్ద, కాలువల వెంబడి శుభ్రం చేశారు. దీని వల్ల దోమలు వృద్ధి తగ్గి విధ్యార్ధులు ఆరోగ్యంగా ఉంటారనీ ఎండిఓ ఆంజనేయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ ఓఆర్డి మహేష్ పాల్గొన్నారు