అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన చిన్నకోనెల, బూరిగ ఆదివాసీ గిరిజనులు గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన చేపట్టారు. 50ఏళ్లుగా ఈ భూముల్లో సాగు చేస్తున్నామన్నారు. మా సాగు భూములను గిరిజనేతరులైన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరు మీద మార్పు చేశారన్నారు. ఈ విషయమై తక్షణమే జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు.