అనుమతి లేకుండా బాణసంచాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. ఆదివారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.