అచ్యుతాపురంలో అభిజిత్ పరిశ్రమ యజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు గురువారం ఖాళీ ప్లేట్లతో నిరసన చేపట్టారు. వెయ్యి మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడినట్లు సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ లేఔట్ ప్రకటించిన అభిజిత్ పరిశ్రమ యజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పండగల్లో కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.