AP: మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదని ఓ లెక్చరర్ విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా డోన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చోటు చేసుకుంది. లెక్చరర్ దేవేంద్ర విద్యార్థులకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయని విద్యార్థులను లెక్చరర్ దేవేంద్ర దారుణంగా కొట్టారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్పడంతో.. కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు.