కొండకల్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు ఉదయం నుండి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. సాయంత్రం పాఠశాలలో జరిగిన సమావేశంలో వారి అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయునిగా, జిల్లా విద్యాధికారిగా, మండల విద్యాధికారిగా, వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ విద్యాకర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని అన్నారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమైన మలుపు అని అన్నారు. ఏప్రిల్ లో జరుగబోయే పదవ తరగతి పరీక్షలో బాగా చదువుకొని పరీక్షలు వ్రాసి పాఠశాలకి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి. రఘునందన్ రెడ్డి, అంజిరెడ్డి, కుసుమ కుమారి, యాదమ్మ, రాధారెడ్డి, శ్రీనివాస్, జంగయ్య, రాములు, సుజాత, హరికృష్ణ, యాదయ్య, వెంకటేష్, అరుంధతి, స్వప్న, పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி