మన పిల్లలని మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం

కామేపల్లి మండలంలోని తాళ్లగూడెం గ్రామంలో గురువారం ఉదయం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో కలిసి గ్రామంలో పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలో కల్పిస్తున్న నూతన సదుపాయాలు గురించి వివరిస్తూ, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే ఎందుకు చదివించాలో తెలియజేస్తూ, నూతనంగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన విషయం, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల స్కూల్ యూనిఫామ్, ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్, మధ్యాహ్నం భోజనం ఇలా ప్రభుత్వం సమకూర్చిన సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మేధస్సు ను పిల్లలకోసం ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు-విద్యాసాగర్, ఉపాధ్యాయురాలు-విజయలక్ష్మి, సర్పంచ్-లకావత్ సునీత, పంచాయితీ కార్యదర్శి-భూక్యా వెంకటేష్, స్పెషల్ ఆఫీసర్-లలితా కుమారి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி