ఇల్లందు: వైద్య సిబ్బందిని నియమించాలని పల్లెదవాఖాన ఎదుట సీపీఎం ఆందోళన

ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలో పల్లెదవాఖానలో వైద్యుడు, రెగ్యులర్ ఏఎన్ఎంను నియమించాలని డిమాండ్ చేస్తూ సబ్‌ సెంటర్ ఎదుట సీపీఎం గ్రామ శాఖ అధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి మంగళవారం ఆందోళన నిర్వహించారు. వైద్య అధికారి, ఏఎన్ఎం లు లేక బీపీ, షుగర్ వ్యాధులు, ఇతర సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி