పెబ్బేరులో రావి, వేప చెట్లకు పెళ్లి

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం కార్తీక మాసం చతుర్దశి సందర్భంగా ఆలయ నిర్వాహకులు రావి, వేప చెట్లకు అత్యంత వైభవంగా కల్యాణ మహోత్సవంను నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. వివాహ అనంతరం భక్తులకు భోజన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, కవిత శంకర్, లక్ష్మి, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி