మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం ఓ మందు బాబు వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా తాగి, తన ఆటోతో ఒక కారును ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా తన ఆటో డ్యామేజీ అయిందని, తనకు నష్టపరిహారం చెల్లించాలని నడిరోడ్డు మీదనే నానా రాద్ధాంతం సృష్టించాడు. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ అతను వినే స్థితిలో లేకపోవడంతో మందు బాబును పోలీస్ స్టేషన్ కు తరలించారు.