పసిఫిక్‌లోని సోలమన్ దీవుల సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పగడం కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వారు కనుగొన్న కొత్త ఆవిష్కరణ వివరాలను గురువారం వెల్లడించారు. ఈ పగడం దాదాపు 300 ఏళ్ల క్రితం నాటిదని అంచనా వేశారు. ఇది 34 మీటర్ల వెడల్పు (111 అడుగులు), 32 మీటర్ల పొడవు (104 అడుగులు) అని బృందం పేర్కొంది. ఇది పగడపు దిబ్బకంటే భిన్నంగా ఉంది.