శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్ ‘స్వామి’ చాట్‌బాట్ లోగోను ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తులకు 6 భాషల్లో.. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు. శబరిమలలో పూజాసమయాలు, రవాణాసదుపాయాల గురించి ‘స్వామి’ ద్వారా పొందవచ్చు.