కోవూరు: జొన్నవాడలో కార్తీక సోమవారం పూజలు

కోవూరు నియోజకవర్గ పరిధిలోని జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిమంది భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాత్రి స్వామి వారి ఊరేగింపు కనుల పండగగా సాగింది.

தொடர்புடைய செய்தி