యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 18 సోమవారం జరగాల్సిన ప్రజా వాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం. హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్- 3 పరీక్షలు, ఇంటింటా సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతున్నందున ప్రజావాణిని బంద్ పెట్టామని తెలిపారు. సోమవారం ప్రజలు కలెక్టరేట్ కు రావొద్దని సూచించారు.