యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని చందుపట్ల పీఏసీఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ ఈ నెల 12న సహకార కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, పాలకవర్గం యథావిధిగా కొనసాగాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ జరిపిన విచారణ మేరకు రద్దు చేశారు. చైర్మన్ మందడి లక్ష్మి నర్సింహరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా పాలకవర్గాన్ని రద్దు చేసే అధికారం లేదన్నారు.