డీఎన్ఎలో సారూప్యతతో పాటు, మెదడు నిర్మాణం, రోగ నిరోధక వ్యవస్థలు ఎలుకలు, మనుషుల్లో దాదాపు ఒకేలా ఉండటంతో శాస్త్రవేత్తలు తమ కొత్త ప్రయోగాన్ని మానవులకు బదులుగా ఎలుకలపై చేస్తారు. మనుషుల్లానే ఎలుకలకు అనేక వ్యాధులు సోకడంతో పాటు, అవి తక్కువ (2-7 ఏళ్లు) జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఎలుకలపై ప్రయోగ ప్రభావాన్ని వేగంగా గుర్తించొచ్చు. వాటిపై ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి నైతిక సమస్యలు ఉండవు.