వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో CM రేవంత్ తో సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజన్న దర్శనానికి ముందు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేసి పూజ నిర్వహించినట్లు చెప్పారు. దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారని.. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారని తెలిపారు.