ఈ రోజు ఆదివారం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హసన్ పర్తి మండలం లోని శుభమస్తు గార్డెన్స్ లో పలు డివిజన్ లోని అర్హులైన లబ్ధిదారులకుమ కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందిచడం జగింది. ఈ మేరకు 55వ డివిజన్ పరిధిలో అర్హులైన కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులులకు డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజితవేంకటేశ్వర్లు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం క్రింద డివిజల్లో దాదాపు 27 లక్షలు రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. కేసిఆర్ ఒక పెద్ద కొడుకుగా వారికి అండగా నిలుస్తున్నారని రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్, డివిజన్ ఉపాధ్యక్షులు రాయికంటి సుధాకర్, డివిజన్ యూత్ అధ్యక్షులు గుంజే సాయికుమార్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాతి సమ్మయ్య, గాదె మహిపాల్, చింతల ప్రశాంత్, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.