అతి భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన భీమారం నవయుగ కాలనీలోని 50 కుటుంబాలకు గ్లోబల్ కోలాబరేటివ్ ఇనిషియేటివ్స్ వారు బియ్యం ప్యాకెట్లు బుధవారం ఉచితంగా అందించారు. సంస్థ అధినేత కరగాని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు సాయం చేసేందుకు సంస్థ ఎళ్లప్పుడు సంసిద్ధంగా ఉంటుందన్నారు. కార్పొరేటర్ జక్కుల రజితవెంకటేషర్లు, సంగాల విక్టరీబాబు, భాగ్యలక్ష్మి, అనిల్, భగత్ తదితరులు పాల్గొన్నారు.