మంగళవారం సీరోల్ (కురవి )మండలం కాంపెల్లి గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంనకు మహబూబాబాద్ జిల్లా పశువైద్య అధికారి Dr. B కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆడ దూడలు పుట్టే లింగ నిర్ధారణ చేసిన సెక్స్ సార్టెడ్ సేమెన్ అందుబాటులో ఉన్నదని దీనిని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.