55వ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గా గడ్డం భాగ్యలక్ష్మి మరియు ప్రధాన కార్యదర్శిగా సంగాల సుజాత ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, జిల్లా రైతు బందు సభ్యులు సంగాల విక్టరీ బాబు, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్, ఎర్రగట్టు గుట్ట చైర్మన్ చింతల లక్ష్మణ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.