వేసవిలో నీటిఎద్దడి లేకుండా నీటి సరఫరా జరగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ పరిధి 34వ డివిజన్ శివనగర్ లో మంగళవారం బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే అదనపు కలెక్టర్ సంధ్య రాణి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి చివరి ఇంటి వరకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్ స్థానికులను నేరుగా అడిగి తెలుసుకొగా నీటి సరఫరాను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.