ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని మంగళవారం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు. అరెస్టును ఖండిస్తూ రాంనగర్ లోని జిల్లా ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలోని పలు సమస్యలపై ఉద్యమించే నాయకున్ని అరెస్ట్ చేయడం ఏమిటని హెచ్చరించారు.