ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 2352 మంది ఉన్నారని, 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వరంగల్ కలెక్టర్ సత్య శారద మంగళవారం తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీ ఓ, ముగ్గురు ఓపీఓల చొప్పున నలుగురు అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని తెలిపారు.