రాష్ట్రవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం రాష్ట్ర బీసీ కమిషన్ బృందం హనుమకొండకు వస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి దామాషా ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.