వరంగల్ గ్రీవెన్స్ ఫిర్యాదులపై బల్దియా అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం న్యూ శ్యాంపేట్ లో అక్రమ రోడ్డు నిర్మాణం జరిగింది అంటూ స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. బల్దియా అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టి, మేము కాదు ప్రైవేటు వారు చేపట్టారని సమాధానం చెవుతున్నారని వాపోయారు. ప్రశ్నించిన బాధితులను, ఫిర్యాదుదారుల సమస్యలు వినకుండానే బయటికి గెంటివేస్తున్నారన్నారు.