హన్మకొండలో రాష్ట్ర ప్రభుత్వం భాషోపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత భాషాంజలి ఆత్మ గౌరవ సభకు రాష్ట్ర మంత్రి సీతక్క ఆదివారం హాజరయ్యారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి అని, తల్లీ తండ్రులు కనిపెంచితే గురువులు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి సన్మార్గం నడిపిస్తారన్నారు.