మై భారత్ ప్రోగ్రామ్ కింద వరంగల్ కోట, గుండు చెరువు పరిసర ప్రాంతంలో శనివారం అడ్వెంచర్ క్యాంప్‌ను నిర్వహించారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ “అడ్వెంచర్ క్యాంప్ ద్వారా శారీరక దృఢత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పని చేసే నైపుణ్యం, సహకార భావన, సమస్యల పరిష్కార సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, భయాలను అధిగమించడం వంటివి అభివృద్ధి చెందుతాయన్నారు.