జాబ్ మేళా విజయవంతానికి వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అభిప్రాయపడ్డారు. శుక్రవారం వరంగల్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను గురువారం బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడేతో కలిసి క్షేత్రస్తాయిలో పర్యటించి జాబ్ మేళాను విజయవంతం చేయడంపై వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.