వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్ లో ప్రకటించారు. జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలిపారు. సీఎంతో చర్చించి త్వరలో ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.