వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముందుకు వచ్చిందని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డీజీఎం సమ్మయ్యతో కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు. సీఎస్ఆర్ పనుల కింద వైద్య పరికరాలు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన అధికారులను అభినందించారు.