మందకృష్ణ మాదిగ మనువాదుల మోచేతి నీళ్లు తాగి ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తున్నాడని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. గురువారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్ర వరంగల్ నగరానికి చేరుకుంది. వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుండి ఎస్సీ, ఎస్టీలకు వర్గీకరణ ఆపాలంటూ మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర 16 జిల్లాలలో 36 నియోజకవర్గాలలో 1000 కిలోమీటర్ల మేర నడుస్తుందన్నారు.