ఓరుగల్లు వాసుల గగనయానం కల త్వరలో నెరవేరబోతున్నది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా వరంగల్ మామునూరును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం అని మంత్రి కొండా సురేఖ గురువారం తెలిపారు. ప్రయాణికులు సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ప్రణాళికల రూపకల్పన, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్ పోర్టు సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతిలో దూసుకుపోతుందన్నారు.