వరంగల్: ల్యాబ్ ను సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

67பார்த்தது
వరంగల్ జిల్లా వైద్య అధికారులు శనివారం ఎలాంటి పర్మిషన్లు లేని క్లినిక్ లను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఖిలా వరంగల్ లోని హెల్త్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ను తనిఖీ చేశారు. అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్ రమేష్, అతని వద్ద అనుమతులు లేకుండా ఉన్న ల్యాబ్ ను, హాస్పిటల్ ని సీజ్ చేసినట్లు వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అనుమతులు లేకుండా క్లినిక్ లను నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி