లింగాల ఘనపూర్ మండలం, కళ్లెం, కుందారం, నెల్లుట్ల గ్రామం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని కావ్య అన్నారు.