నిన్న మొన్నటి వరకు మంత్రికి మరియు జిల్లా ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు నియోజకవర్గాలకు సైతం పాకుతున్నాయి. తాజాగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మరియు కాంగ్రెస్ నాయకురాలు సింగాపురం ఇందిర వర్గాల మధ్య విబేధాలు బగ్గుమన్నాయి. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి రావడంతో అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది అని గురువారం మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.