ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

66பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி