కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కులగణన సర్వేపై అవగాహన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే పాల్గోన్నారు. కుల గణన కార్యక్రమం ద్వారా సామాజిక సమానత్వం, సంక్షేమం, అభివృద్ధి సాధించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.