పాలకుర్తి: ముస్తాబైన సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

53பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం ఆలయ అధికారులు ఆలయ ఆర్చ్ గేట్, ముఖద్వారం, గుట్ట, ఘట్ రోడ్డు విద్యుత్తు లైట్లతో అలంకరించారు. ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొనున్నారు.

தொடர்புடைய செய்தி