పాలకుర్తి: డయాగ్నస్టిక్ సెంటర్ ను సీజ్ చేసిన జిల్లా వైద్యశాఖ అధికారి

66பார்த்தது
పాలకుర్తి: డయాగ్నస్టిక్ సెంటర్ ను సీజ్ చేసిన జిల్లా వైద్యశాఖ అధికారి
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండల కేంద్రంలో అనుమతి లేని రోగ నిర్దారక కేంద్రాన్ని సీజ్ చేసారు. బుధవారం రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో మాతృశ్రీ డయాగ్నస్టిక్ సెంటర్ ను జిల్లా వైద్యశాఖ అధికారి మురళీధర్ సీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుమతులు లేకుండా ఎలాంటి ఆసుపత్రులు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలను నిర్వహించవద్దని వివరించారు.