మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సోమేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్టు ద్వారా 50 వేల వాటర్ బాటిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.