పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వంపై 4వ తేదీన తొర్రూరులో నిర్వహించబోయే నిరసనగా, ధర్న కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.