వరంగల్: తాలు, తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చెయ్యెద్దని అధికారులను, మిల్లర్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై అధికారులు మిల్లర్లతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో అధికారులు పర్యవేక్షణ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు.