దుగ్గొండి మండలం తిమ్మంపేటకి చెందిన పాలడుగుల మల్లమ్మ శుక్రవారం సాయంత్రం నర్సంపేటకు వెళ్లి పనులు ముగించుకొని లక్నెపల్లిలో దిగి స్వగ్రామమైన తిమ్మంపేటకు నడుచుకుంటూ వెళ్తున్నారు. చలపర్తి గ్రామం ఎస్సీ కాలనీ శివారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి మల్లమ్మ మెడలో ఉన్న రెండున్నర పుస్తెల తాడును అపహరించుకుపోయారు. వెంటనే మల్లమ్మ కేకలు వేయడంతో అటు వెళుతున్న వారు దొంగలను వెంబడించగా ఫలితం లేకుండా పోయింది.