వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా సురేశ్ ఎన్నికయ్యారు. ఆదివారం ఆలయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సెక్రటరీగా కమలాకర్ రెడ్డి, కోశాధికారిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శంకరయ్య ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకవర్గం తెలిపింది.