ములుగు జిల్లా రామప్పలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని కలెక్టర్ సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26 నుండి జరిగే వేడుకలకు బస్సులు, పారిశుద్ధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. 3 రోజులపాటు 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.