తాడ్వాయి మండలం కాటాపూర్ ఫీడర్ మీదుగా మంగపేటకు వేస్తున్న కొత్త 33 కేవి విద్యుత్ లైను పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు మంగపేట మల్లూరు సబ్ స్టేషన్ల పరిధి గ్రామాలకు విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాటాపూర్ సబ్ స్టేషన్ పరిధి గ్రామాలకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.