ములుగు జిల్లా ఏటూరూనాగారం ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ట్రాఫిక్ జాం అయింది. మూలమలుపులో ప్రవేటు కంపెనీ కి చెందిన కంటైనర్ ఇరుక్కుంది. దీంతో గంట పాటు రెండు వైపులా ఆర్టీసి , ప్రైవేటు వాహనాలు నిలిపోయాయి. ఇరుకు రోడ్డులో ప్రతి రోజూ ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసిబి సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు.