మహబూబాబాద్ జిల్లా గోపాలపురం కాలనీ కి వెళ్లే దారిలో చెరువు మత్తడి కారణంగా రోడ్డంతా పాకురు మయంగా మారింది. దీంతో కాలనీ వాసులు వెళ్లే దారిలో జారి పడటం, కాళ్లు చేతులు విరగడం లాంటివి జరుగుతున్నాయి. స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలంటూ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరారు.