ప్రాథమిక పాఠశాలలో అర్బిఎస్కే వైద్య పరీక్షలు

1570பார்த்தது
ప్రాథమిక పాఠశాలలో అర్బిఎస్కే వైద్య పరీక్షలు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌల్ల తండ గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట తండ ప్రాథమిక పాఠశాలలో అర్బిఎస్కే కార్యక్రమంలో భాగంగా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి తదితర చిన్న సమస్యలు ఉంటే వెంటనే మందులు ఇవ్వడం జరుగుతుంది అని అదే విధంగా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రి కి లేదా వరంగల్ డిఈఐసికి పంపించి వారి ఆరోగ్య సమస్యకు తగు పరిష్కారం చూపడం జరుగుతుందని వారు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி